లోకల్ మార్కెట్లోకి స్విగ్గీ
ఈ కామర్స్ వ్యాపారం ఇండియాలో జోరందుకుంది. ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే వినియోగదారులు ఎక్కువగా ఫుడ్, ఎంటర్టైన్ మెంట్, ఫ్యాషన్, దుస్తులు, షూస్ , ఎలక్ట్రానిక్స్ , స్పోర్ట్స్, గోల్డ్, డైమండ్స్, వెండి తదితర వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వ్యాపారులు, యూత్ అంతా వీటి మీదే మోజు పెంచుకున్నారు. దీంతో దేశ, విదేశీ కంపెనీలన్నీ ఈ కామర్స్ రంగంలోకి ఎంటరవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ను చైనా కు చెందిన కంపెనీలు డామినేట్ చేస్తుండగా, ఇండియన్, అమెరికాకు చెందిన కంపెనీలు సైతం అమ్మకాల్లో దుమ్ము రేపుతున్నాయి.
గత ఐదేళ్లుగా భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుండి నోట్ల రద్దు ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. జీఎస్టీ దెబ్బకు జనం, బిజినెస్ పర్సన్స్ విలవిలలాడి పోయారు. ఆయా ప్రభుత్వ బ్యాంకులు ఎన్నడూ లేనంతగా నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు తమకు అందుబాటు ధరల్లో ఉన్న వాటికే ప్రయారిటీ ఇస్తుండడంతో ఈ కామర్స్ కంపెనీలు ఇంటి వద్దకే సేవలు అందజేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాటో, స్విగ్గి లాంటి కంపెనీలు ఇంటి వద్దకే సేవలు అందజేస్తున్నాయి. ఇందు కోసం డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానం చేసుకున్నాయి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. కేవలం బుక్ చేసుకున్న కొద్దీ గంటల లోపే కోరుకున్న వస్తువులు ఉన్న చోటుకే వస్తున్నాయి. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఆదాయం సమకూరుతోంది.
ఇదే ల్లక్ష్యంతో నిత్యావసరాల నుంచి ఔషధాల వరకు అన్నీ డెలివరీ చేయాలనీ స్విగ్గి కంపనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ సేవలకు మాత్రమే పరిమితమైన సంస్థ మరిన్ని విభాగాలలోకి విస్తరిస్తోంది. నిత్యావసరాలు, ఔషధాలు మొదలైన వాటి డెలివరీ సేవలకు సంబంధించి లోకల్ కామర్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. స్థానిక సూపర్ మార్కెట్ చెయిన్స్, ఫార్మసీలు, మటన్ షాపులు, పెట్ స్టోర్స్, పూల విక్రేతలు మొదలైన వారితో స్విగ్గీ చేతులు కలపనుంది. లోకల్ సర్వీసుల విభాగంలో డన్‌జో, మిల్క్‌బాస్కెట్, 1ఎంజీ వంటి సంస్థలతో స్విగ్గీకి పోటీ ఎదురు కానున్నది. ఫుడ్ టెక్ కంపెనీగా స్విగ్గీ భారీ స్థాయిలో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. మొత్తం మీద కొత్త ఐడియా వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి