విదేశీ కంపెనీలపై కన్నేసిన రిలయన్స్

భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే రిటైల్, ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ , ఫ్యాషన్ , డిజిటల్ టెక్నాలజీ, తదితర రంగాలపై దృష్టి పెట్టిన సదరు కంపెనీ విదేశాల్లో తన హవాను కొనసాగించాలని పావులు కదుపుతోంది. ప్రత్యర్థి కంపెనీలకు దిక్కుతోచని రీతిలో దెబ్బ కొడుతూ, తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళుతోంది ఆర్ ఐ ఎల్. లక్ష కోట్లకు పైగా ఉన్న అప్పులను త్వరలో తీరుస్తామని ఇటీవలే ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. దీంతో ఉన్నఫలంగా షేర్ మార్కెట్ లో షేర్లు పెరిగి పోయాయి.

ఇన్వెస్టర్స్ కు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్స్ కు చుక్కలు చూపిస్తోంది. ఫ్యాషన్ , జ్యుయెలరీ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తోంది. అబ్రాడ్ లో టాప్  రేంజ్ లో ఉన్న విదేశీ కంపెనీలను చేజిక్కించు కోవాలని పావులు కదుపుతోంది. ఇందు కోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఫ్యాషన్ , పిల్లలకు సంబంధించిన  దుస్తులు, వస్తువులను టార్గెట్ చేస్తోంది. ప్రతి రంగంలోకి ఎంటర్ కావాలని అనుకుంటోంది. గ్లోబల్ బ్రాండ్ లుగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని వల్ల కంపెనీ విలువ పెంచు కోవడం , దాని మేరకు బిజినెస్ విస్తరించడం, వాటాలు పొందేలా చూస్తోంది.

కొన్ని కంపెనీలను చేజిక్కించు  కోవడం, మరి కొన్ని కంపెనీలలో భాగస్వామ్యం కలిగి ఉండటం, ఇంకొన్నింటిని టేకోవర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఇండియా అంతటా తమ బిజినెస్ ను విస్తరించామని, విదేశాలలో కూడా ఎంటర్ కావాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నామని ఆర్ఐఎల్ సీయివో దర్శన్ మెహతా వెల్లడించారు. ఫ్రాంచైస్ తీసు కోవడం , కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం లేదా కొనుగోలు చేసు కోవడం పైన దృష్టి పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో రిలయన్స్ కంపెనీ తన బ్రాండ్ ఉండాలని, టాప్ రేంజ్ కు చేరు కోవాలని ఆరాటపడుతోంది. మరి చేరుకుంటుందా లేక చతికల పడుతుందా వేచి చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!