కొలువుదీరారు..కొలువుల మాటేమిటి..?
తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఆరు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కేబినెట్ సంఖ్య 18 కి చేరింది. మంత్రులుగా కొలువుతీరిన వారిలో కేటీఆర్ , హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి లు ఇది వరకే ఒకసారి మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్నది. కల్వకుంట్ల తారక రామా రావు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఐటీ, మున్సిపల్ , మైనింగ్ శాఖా మంత్రిగా పని చేశారు. ఇక తన్నీరు హరీష్ రావు నీటి పారుదల శాఖా మంత్రిగా ఉండగా, సబితా ఇంద్రా రెడ్డి గత ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో హోమ్ శాఖా మంత్రిగా పని చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కారెక్కారు.
దీంతో అప్పుడే సీఎం కేసీఆర్ సముచిత స్థానం ఇస్తానని చెప్పారు. అదే విధంగా తన మాట నిలబెట్టుకున్నారు. ఇక కొత్తగా ఈ ఆరుగురిలో మరో ముగ్గురు గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ లకు మంత్రులుగా పని చేసే ఛాన్స్ దక్కింది. మరో వైపు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఇద్దరికీ ఉద్వాసన తప్పదనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా కేసీఆర్ తనదైన ముద్ర వేశారు. కుల, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. మంత్రులుగా కొలువు తీరిన వెంటనే వారికి శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి. కేటీఆర్ కు తిరిగి ఐటి, మున్సిపల్, మైనింగ్ శాఖలు కేటాయించారు. హరీష్ రావుకు కీలకమైన ఆర్ధిక శాఖ పదవి కట్టబెట్టారు. అంతకు ముందు ఈటెల దీనిని నిర్వహించారు.
సబితా ఇంద్రా రెడ్డికి విద్యా శాఖ కేటాయించగా , పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణా శాఖ ఇచ్చారు. ఈయనకు కేటీఆర్ అనుచరుడనే పేరుంది. సత్యవతి రాథోడ్ కు గిరిజన, స్త్రీ సంక్షేమం ఇవ్వగా, గంగుల కమలాకర్ కు బీసీ , పౌరసరఫరాల శాఖను కేటాయించారు. మొత్తం మీద అందరికీ మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డికి ఆ శాఖ నుంచి తప్పించారు. ఆయనకు విద్యుత్ శాఖ అప్పగించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి