దివ్యంగుల పాలిట దేవత..పుష్ప..!

ఉదయం నుంచి రాత్రి దాకా స్మార్ట్ ఫోన్స్  లేదా షాపింగ్స్  , సీరియల్స్ లలో మునిగి తేలిపోతూ కాలాన్ని గుర్తించని మహిళలు ఆమెను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. జీవితం అంటే మనం బతకడం కాదని, ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడం, చేతనైనంత సాయం చేయడం అని నమ్మింది బెంగళూర్ కు చెందిన పుష్ప. గత ఏడాది ఆమె అందించిన సేవలకు గాను నారి శక్తి  పురస్కారం పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. అందరిలా ఆమె ఇంట్లో కూర్చో లేదు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే మరో వైపు తనకు వీలున్నప్పుడల్లా వికలాంగులకు తోడుగా నిలిచింది.

అంతే కాకుండా 700 మందికి పరీక్షలు రాయడంలో సహాయం చేసింది. తన స్నేహితురాలు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరడంతో ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంది పుష్ప. చాలా మంది విద్యార్థులు మానసిక, శారీరక , బుద్ది మాంద్యం లోపం కలిగి ఉండడంతో చదువు కోవడం, పరీక్షలు రాయడం కష్టతరంగా మారింది. దీనిని పుష్ప మిత్రురాలు గుర్తించింది. వారికి తమ సంస్థ తరపున వేరే వారితో రాసే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే ఇట్టి సెక్టార్ లో పని చేస్తున్న పుషను కూడా సంప్రదించింది. ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, వీరికి సేవ చేయడం అంటే ఒక రకంగా సమాజానికి  సేవ చేయడం లాంటిది .

తాను వీలున్నప్పుడు పరీక్షలు రాసేందుకు సిద్ధమేనంటూ సమ్మతి తెలిపింది. ఇలా ఒకరితో రాయడం ప్రారంభమైన ఈ ప్రస్థానం ఏకంగా 700 మందికి పైగా విద్యార్థులకు చేరుకుంది. పుష్ప ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవా దృక్పథంతో చేస్తూ వచ్చింది. ఆమె చేసిన కృషిని ఎందరో గుర్తించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు వికలాంగులకు తోడ్పాటు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ స్త్రీ శక్తి పురస్కార్ కు ఎంపిక చేసింది. ఐటీ ఉద్యోగులే కాకుండా మిగతా వారు పుష్ప ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!