ఇక సెలవు .. మరువలేను ఉండలేను..నరసింహ్మన్..!

సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఏర్పడిన నూతన రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా పని చేసిన నరసింహ్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ తెలుగు ప్రాంతాలతో మమేకమై పోయారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు , నాగరికత తమ ప్రాంతంతో ముడి పడి ఉండడం వల్లనైతేనేమి విడిచి ఉండలేక పోతున్నానంటూ బాధ పడ్డారు. ఇన్నేళ్ల పాటు గవర్నర్ గా పని చేయడం అరుదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, సమ్మెలు, ఆందోళనలు, అరెస్టులు, కేసులు , ఆత్మహత్యలు , బలిదానాలు, త్యాగాలు అన్నీ నరసింహ్మన్ కళ్ళ ముందే జరిగాయి. అంతకు ముందు ఆయన హోమ్ శాఖలో పని చేసిన అనుభవం ఉన్నది. పలు ప్రాంతాలలో సేవలు అందించారు. ఇదే అనుభవం ఉమ్మడి రాష్ట్ర సమయంలో పనికి వచ్చింది.

ఉవ్వెత్తున సునామీలా ఎగసి పడిన ఉద్యమాన్ని గుర్తించడంలోనూ , ప్రాణ నష్టం జరగకుండా నియంత్రించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. కేసీఆర్ , చంద్రబాబు లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఒకానొక సమయంలో సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు అలాగే వుంది పోయాయి. నీటి వాటా విషయంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇరువురు సీఎంలను కూర్చో బెట్టి సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. అయినా వర్క్ అవుట్ కాలేదు . తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి తెలంగాణాలో కేసీఆర్ భారీ మెజారిటీ సాధిస్తే , ఏపీలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది.

ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎం లు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వెళుతున్నారు. గతంలో అప్పటి సీఎం చంద్ర బాబు నాయుడు నరసింహ్మన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపై కాంప్రమైజ్ అయ్యారు. గవర్నర్ దంపతులు ఇద్దరు తెలుగు సంసృతితో కలిసి పోయారు. అన్ని పార్టీల వారిని ఆదరించారు. దేవాలయాల అభివృద్ధికి , విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఆయనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూయించుకున్నారు. ఆకస్మికంగా బడులను తనిఖీ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవ్వుతూ స్వీకరించారు. మొత్తం మీద మిమ్మల్ని విడిచి వెళ్లడం బాధగానే ఉన్నా ..మీ జ్ఞాపకాలను మాత్రం మరువలేక పోతున్నాని వాపోయారు. నరసింహ్మన్ జీ ..మిమ్మల్ని ఎలా మరువగలం..!

కామెంట్‌లు