ఇబ్బందుల్లో ట్రబుల్ షూటర్..!
కన్నడ నాట రాజకీయం మరింత వేడి పుట్టిస్తోంది. కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ దక్షిణాదిన అధికారంలోకి రావాలని ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను, ట్రబుల్ షూటర్స్ లీడర్లను టార్గెట్ చేసింది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసును నామ రూపాలు లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. తమిళనాడులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ను ఇప్పటికే అరెస్ట్ చేసింది. మరో వైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న డీకే శివ కుమార్ ను అరెస్ట్ చేసింది ఈడీ, ఐటి. .
ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించడం, పార్టీకి బలాన్ని చేకూర్చడం డీకే శివకుమార్ వెరీ ఎక్స్ పర్ట్. ఇప్పుడు ట్రబుల్స్ లో ఆయన చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో డీకేను అరెస్ట్ చేశారు. దీంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇటీవల సంకీర్ణ సర్కార్ ను కాపాడేందుకు డీకే శివకుమార్ శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఈడీ , ఐటి శాఖలు డీకే ఇంటిపై దాడులు చేశాయి. అప్పట్లో కేంద్రంలోని షా ప్రోద్భలంతోనే జరిగిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరోపించారు. ఇదే బీజేపీకి చెందిన గాలి జనార్దన్ రెడ్డి తో పాటు యెడ్యూరప్ప పై అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గాలి , ఆయన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు.
దేశంలో రెండు చట్టాలు నడుస్తున్నాయంటూ ఆరోపించారు. బెంగాల్ లో ముకుల్ రాయ్, గాలి పై ఆరోపణలు వచ్చినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. కర్ణాటకలో బలమైన నాయకుడైన డీకే శివకుమార్ ను ఇబ్బందులకు గురి చేయాలని టార్గెట్ గా బిజెపి పెట్టుకుందని, దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం డీకే ఇంటి ముందు , రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. కాంగ్రెస్మ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. మరోసారి కన్నడ నాట రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి