దమ్మున్నోడు ..దుమ్ము రేపిండు
ఆ తర్వాత హైదరాబాద్ స్టయిలిస్ట్ , రిస్ట్ ప్లేయర్ అజహరుద్దీన్ , ఎమ్మెస్ ధోని భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించారు.. గంగూలీ , ద్రావిడ్ , సచిన్ ..ఇంకా క్రికెటర్లు తమ ప్రతిభను చాటారు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ మాటల్లో వరల్డ్ లో అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ లలో ఒకరి పేరు చెప్పమంటే ..అజ్జూ భాయి పేరు వెల్లడించారు. తాజాగా సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న ఒకే ఒక్కడు అతడే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఓటమిని ఒప్పుకోడు. గెలుపు సాధించే దాకా నిద్ర పోడు. ఇదే అతడి ఫిలాసఫీ.
పులి లాగా వేటాడతాడు. మైదానంలోకి వచ్చాడంటే సెంచరీ కొట్టకుండా వుండలేడు. సచిన్ మాయలో పడిన ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు కోహ్లీ జపం చేస్తున్నారంటే అతడి ఆట ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ ఆటలో ఏ ఫార్మాట్ లోనైనా ఆడే దమ్మున్న మగాడు కోహ్లీ. అంతేనా వరల్డ్ లో అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లలో మనోడు కూడా ఒకడు. అలవోకగా పరుగులు తీయగలడు. కళ్ళు మూసి తెరిచే లోగా బంతిని గ్రౌండ్ దాటించగలడు. ఇదే అతడి స్పెషాలిటీ. మనోడు హిట్టర్ మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే . తాను ప్రేమించే ప్రియురాలి కోసం..ఆమె కూర్చున్న చోటుకే బాల్ ను కొట్ట గలిగే దమ్మున్నోడు కోహ్లీ. తన రికార్డులను తానే తిరగ రాస్తున్న ఈ ఆటగాడు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి