ఇక.. ఆర్టీసీ కార్మికులు ..ప్రభుత్వ ఉద్యోగులు ..జగన్ కు జేజేలు..!

ఇచ్చిన మాట తప్పకుండా, నిలబెట్టుకోవడంలో మడమ తిప్పని రాజకీయ వారసత్వాన్ని తన తాత రాజా రెడ్డి , తండ్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి నుంచి పుణికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలోను , వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో లోను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను అధికారం లోకి వస్తే,  ప్రభుతంలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో పవర్ లోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు, ఉద్యోగులతో చర్చలు జరిపారు.

ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని, ఇక అందరు సర్కార్ లో భాగస్వాములేనని స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపారు. కొత్తగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులను బదిలీ చేస్తామని, పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు జగన్ వెల్లడించారు. అంతకు ముందు ఆర్టీసీకి సంబంధించి ఏం చేస్తే బావుంటుందో తెలియ పర్చాలని ఐదుగురితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ మేరకు కమిటీ పలు సూచనలు, సలహాలు అందజేసింది సీఎం కు . ఈసందర్బంగా  కేబినెట్ లో ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకునే బిల్లుకు ఆమోదం తెలుపనుందని ఏపీ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఇప్పటినుంచి ఆర్టీసీ ఇక  ప్రభుత్వ రథ చక్రం కానుంది. అదనంగా ఆర్టీసీ డిపోలను పెంచవద్దని జగన్ నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డికి తెలిపారు. దీని ఏర్పాటు వల్ల  సంస్థపై అదనపు భారం పడుతుందని సూచించారు. నష్టాలు రాకుండా సంస్థను మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఎలాంటి వత్తిళ్లు, వేధింపులు ఉండవని , ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 53 వేల మంది ఉద్యోగుల వయసు 60 ఏళ్లకు పెరుగుతుంది. వీరికి అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. మొత్తం మీద రాజన్న రాజ్యాన్ని తలపింప చేస్తున్నారు జగన్. 

కామెంట్‌లు