పోస్ట్‌లు

మ‌నోళ్ల‌కు అండ‌గా నిలుద్దాం

చిత్రం
ఎన్నాళ్ల‌కు ఎన్నేళ్ల‌కు ఇండియ‌న్ విమెన్స్ క్రికెట్ టీం ఫైన‌ల్ కు రావ‌డం. ఒక‌ప్పుడు వాళ్లు ఆడుతున్నారంటే ప‌ట్టించుకునే వాళ్లం కాదు. క‌పిల్ దేవ్, అజారుద్దీన్, స‌చిన్, గంగూలీ నుంచి నేటి కోహ్లి దాకా అంతా వాళ్ల గురించిన చ‌ర్చ‌నే. ఇదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా హైద‌రాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ వ‌చ్చాక భార‌త‌దేశంలో మ‌హిళా క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగేలా చేసింది. క్రికెట్ అంటేనే పురుషుల‌కు మాత్ర‌మే చెందింద‌ని అనుకునే రోజుల నుంచి ఇపుడు ప్ర‌పంచ‌మంతా మ‌హిళ‌లు కూడా ధీటుగా, ధాటిగా ఆడ‌గ‌ల‌ర‌ని నిరూపించారు. దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏకంగా వారి కోసం ప్ర‌త్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. వాళ్ల‌కు కాంట్రాక్టు సిస్టం ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యాక క్రికెట్ ఆట‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పాల‌నా ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించాడు ఈ మాజీ క్రికెట‌ర్. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి నుంచి అంతా మ‌న మ‌హిళా జ‌ట్టు గెల‌వాల‌ని కోరుకున్న వారే. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఇండియా జ‌ట్టు భారీ తేడాతో ఓడిపోయింది. దీనికి బాధ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లో...

లేచి ప‌డిన పృథ్వీరాజ్

చిత్రం
న‌టుడిగా తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న పృథ్వీరాజ్ ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. బాగున్న‌ప్పుడు అంతా పోగైన జ‌నం ఇపుడు ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అనూహ్యంగా త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రూ ఆయ‌న ద‌రిదాపుల్లోకి వెళ్ల‌డం లేదు. ఈ విష‌యాన్ని, ఘోర‌మైన అవ‌మాన‌క‌రంగా భావిస్తున్న‌ట్లు స్వ‌యంగా ఈ న‌టుడే ఇటీవ‌ల వాపోవ‌డం జ‌రిగింది. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మెప్పించిన ఘ‌న‌త పృథ్విది. అంతే కాకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే స్వ‌భావం క‌లిగి ఉండ‌డం కూడా ఆయ‌న కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ వ‌చ్చారు. పృథ్వీరాజ్ కు వైఎస్ ఆర్ అంటే పిచ్చి. అదే వైఎస్ జ‌గ‌న్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ఉంటూ వ‌చ్చారు. అంతేకాకుండా జ‌గ‌న్ స్థాపించిన కొత్త పార్టీలో ఆయ‌న వెంట కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. న‌మ్మ‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఏకంగా పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచారు. పార్టీ ప్ర‌చారానికి ర‌థ‌సార‌థిగా ఉన్నారు. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఓ వైపు వృత్తి ప‌రంగా క‌ళాకారుడైన పృథ్వీరాజ...

ఆస్ట్రేలియానే అస‌లైన విజేత

చిత్రం
అంద‌రూ అనుకున్న‌ట్టుగానే మన మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చేతులెత్తేసింది. ఫైన‌ల్ పోరులో చ‌తికిల‌ప‌డింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌క్కా ప్లాన్ తో ఆడితే..మ‌న వాళ్లు అలా వ‌చ్చి ఇలా పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. వ‌చ్చిన అద్భుత‌మైన అవ‌కాశాన్ని వ‌దులుకున్నారు. దీంతో మ‌రోసారి ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. వ‌రుస‌గా అయిదోసారి టీ20 ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడింది. ఇండియా జ‌ట్టును చిత్తుగా ఓడించింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది..  ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ  హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ, మంధాన, రోడ్రిగ్స్ , హర్మన్ లు ఎలాంటి ప‌ర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చ‌లే...

నిన్న లేబ‌ర్..నేడు సిఇఓ ..విమెన్ స‌క్సెస్ జ‌ర్నీ

చిత్రం
క‌ల‌లు క‌నండి..వాటిని నిజం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. పోతే పోయేదేముంది..జ‌స్ట్ క‌ష్ట‌ప‌డ‌ట‌మేగా. అయితే విజ‌యం వ‌రిస్తుంది. కాక‌పోతే అప‌జ‌యం నేర్పిన అనుభ‌వం ప‌నికొస్తుంది. కొంద‌రిని చూస్తే జాలేస్తుంది. ఇంకొంద‌రిని చూస్తే గుండెల్లో దాచుకోవాల‌ని అనిపిస్తుంది. ఈ స‌మాజంలో ఆడ‌వాళ్లంటే చుల‌క‌న భావం. వాళ్లకు ఏదీ చేత‌కాద‌నే కామెంట్స్ ఎక్కువ‌గా వింటూ వుంటాం. కానీ అవేవీ ఆమె విష‌యంలో అడ్డురాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనిలా జ్యోతి రెడ్డిది క‌న్నీటి క‌థ‌. అత్యంత పేద‌రికం నుంచి వ‌చ్చిన ఆమె ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించింది. లేబ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె ఇపుడు ఏకంగా ప్ర‌పంచాన్ని శాసిస్తున్న అమెరికాలో ఏకంగా ఐటీ రంగానికి సంబంధించి కీ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఒక‌ప్పుడు కూలీగా ప‌నిచేసిన జ్యోతి రెడ్డి ఇపుడు బిగ్గెస్ట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఇది నిజంగా జ‌రిగిన క‌థ‌.  ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలిచిన ఆమె జీవితం ప్ర‌తి ఒక్క‌రికి పాఠం కావాలి. ఐదుగురు పిల్ల‌లు క‌లిగిన ఆ కుటుంబంలో ఎనిమిదేళ్ల‌ప్పుడు పేరెంట్స్ బ‌తుకు భారం ఎక్కువై జ్యోతిరెడ్డిని అనాధ ఆశ్ర‌మంలో చేర్పించారు....

జ‌గ‌న్ నిర్ణయానికి జ‌నామోదం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న అసాధార‌ణ‌మైన నిర్ణ‌యాన్ని జ‌నం స్వాగ‌తిస్తున్నారు. మొద‌టిసారిగా ఓ మ‌హిళ‌కు ఉన్న‌త‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది రాష్ట్రంలో. విజయనగరం జిల్లా  సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. త‌న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసింది. కాగా గ‌త కొన్నేళ్లుగా ఒకే క‌టుంబం చెలాయిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతల...

వ‌ర‌ల్డ్ విమెన్స్ క్రికెట్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా

చిత్రం
భార‌తీయ మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అస‌మాన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచ మ‌హిళ‌ల క్రికెట్ కప్ ఫైన‌ల్‌లోకి దూసుకు వెళ్లింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా వ‌ర్షం అడ్డంకిగా మార‌డంతో ఆట‌ను పూర్తిగా ర‌ద్దు చేశారు. దీంతో మెరుగైన ర‌న్ రేట్ తో పాటు గ్రూపులో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న ఇండియా జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంది. నిబంధ‌న‌లు మార్చాల‌ని, మ‌రోసారి మ్యాచ్ నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ నిర్వాహ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు విన్న‌పించారు. వీరి అభ్య‌ర్థ‌న‌ను ఐసీసీ నిర్ద‌ద్వందంగా తోసి పుచ్చింది. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్లోజ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ నుంచి ఇంగ్లండ్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌కు లోన‌య్యారు. అడ్డ‌దిడ్డ‌మైన నిబంధ‌న‌లు విధించ‌డం వ‌ల్ల తాము గొప్ప ఛాన్స్ మిస్స‌య్యామ‌ని ఆవేద‌న చెందారు. ఇంకో వైపు ఈ టోర్న‌మెంట్‌లో ఎలాంటి ఓట‌మి చెంద‌కుండానే భార‌త విమెన్స్ క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకు వెళ్లింది. ఇండియ‌న్ క్రికెట‌ర్స్ క‌లిసి క‌ట్టుగా ఆడారు. అద్భుత నైపుణ్యాన్ని ప్ర‌ద‌...

ఉద‌య శంక‌రా..మ‌జాకా

చిత్రం
ఎందుకో ఈవేళ మ‌ళ్లీ ఉద‌య్ శంక‌ర్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పాలి. విజ‌యం అంటే ఏమిటో..గెలుపులోని మ‌జా ఏమిటో..అట్ట‌డుగున ఉన్న సంస్థ‌ను అత్యున్న‌త‌మైన స్థాయికి తీసుకు వెళ్ల‌గ‌లిగే ద‌మ్మున్న ఒకే ఒక్క‌డు. ఎంత చెప్పినా త‌క్కువే..ఇంకా ఇంకా ఎంతో చెప్పాల‌న్న క‌సి ఎక్కువ‌వుతోంది. ఎవ‌రీ ఉద‌య్  అనుకుంటున్నారా..ఇంకెవ‌రు..ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ స‌క్సెస్ ఫుల్ సిఇఓ. ఇపుడు స్టార్ టీవీ గ్రూపును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అంతే కాదు స్టార్ టీవీకి కొత్త రూపును ..ఊపును తీసుకు వ‌చ్చాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా స్టార్ మీడియాకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. దీనికి ఓ ఇండియ‌న్ పూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం. దానిని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి తీసుకు  వెళ్లేలా చేయ‌డం ఓ చ‌రిత్ర‌. భార‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా..సాంప్ర‌దాయాలు వెళ్లి విరిసేలా దేశ‌మంత‌టా స్టార్ ను టాప్ పొజిష‌న్‌లో ఉండేలా ప్ర‌య‌త్నం చేశాడు. అందులో ఉద‌య్ శంక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ఈ సిఇఓ ఏది చేసినా అది ఓ సెన్సేష‌న్. భార‌తీయ బుల్లితెర మీద స్టార్ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. మిగ‌తా టీవీ యాజ‌మాన్యాలు అందుకోలేనంత ఎత్తుకు తీసు...