పోస్ట్‌లు

మెట్రోకు జైకొట్టిన జనం

చిత్రం
హైదరాబాద్ ఐటీ హబ్ గా మారాక నగరవాసులు, యూత్ జోష్ మీదుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. అంతే కాదు ఎన్ని సీసీ కెమెరాలు అమర్చినా జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిటీ వాసులంతా ఆర్టీసీ కంటే మెట్రో సర్వీసెస్ బెటర్ అంటున్నారు. రికార్డు స్థాయిలో ఇందులోనే జనం జర్నీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ లేని ఆదాయాన్ని మూటగట్టుకుంటోంది మెట్రో. కొత్త ఏడాదికి మెట్రో సరికొత్త రికార్డుతో వెల్ కమ్ చెప్పింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 4.60 లక్షల మంది ట్రైన్ జర్నీ చేశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. సెలబ్రేషన్స్​ నేపథ్యంలో ట్రైన్స్​ టైమింగ్ పెంచడం, మద్యం లిమిట్‌గా తాగిన వాళ్లకూ అనుమతి ఇవ్వడం మెట్రోకు కలిసొచ్చింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పొడిగించిన టైమింగ్స్‌తో ఒక్క రోజులో లక్షల మంది మెట్రోజర్నీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రోకు ఇది మరో మైలురాయి. గతంలో 4.10 లక్షల నుంచి 4.20 లక్షల మంది వరకు గరిష్ఠంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయి.​ సెలబ్రేషన్స్ సందర్భంగా రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. లిమిటెడ్‌‌గా మద్యం తాగిన వారిని ప్రయాణించేందుకు అనుమతించడంతో నగర వాసులు ఎక్కు...

ఇక ఆఫ్ లైన్లోనే మొబైల్స్

చిత్రం
ఆఫ్ లైన్ లో వ్యాపారం తగ్గుతోంది. అన్ని కంపెనీలు ఆన్ లైన్ జపం చేస్తున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పట్టిన రిటైలర్లు, వ్యాపారులకు తీరని నష్టం జరుగుతోంది. ఇటీవల ఈ కామర్స్ వ్యాపారం ఎన్నడూ లేని రీతిలో కోట్ల రూపాయల్లోకి చేరింది. ప్రతి ఒకరు ఆన్ లైన్ లోనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చైనా దిగ్గజ మొబైల్ కంపెనీ వివో ఇక నుంచి ఆన్ లైన్ లో మొబైల్స్, యాక్ససరీస్ ను అమ్మబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వివో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగ దారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌ అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పత్తులన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అ...

నటాషాతో పాండ్యా ఫిక్స్

చిత్రం
గత కొంత కాలంగా చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్‌ కోవిచ్‌ల జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. దీనిలో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నా మెరుపు తీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను అని హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు పోస్ట్‌ చేశాడు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో ఇది ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లను సైతం కాస్త ఆశ్చర్యం కల్గించింది. హార్దిక్‌, నటాషాల నిశ్చితార్థం జరగడంతో పలువురు క్రికెటర్లు విషెస్‌ తెలియ జేశారు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లి వాటే సర్‌ప్రైజ్‌ హార్దిక్‌ అంటూ అభినందనలు తెలిపాడు. కంగ్రాట్స్‌ హార్దిక్‌. వాటే ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌. మీ భవిష్యత్తు మరింత బాగుండాలి అంటూ విష్‌ చేశాడు. ఇక టీమిండియా ఓపెనర్‌, హ...

అబ్బా..ట్రాయ్ దెబ్బ

చిత్రం
తమ చేతుల్లో ఉన్నారు కదా అని అడ్డగోలుగా యూజర్ చార్జీలు పెంచుకుంటూ వెళుతున్న కేబుల్ ఆపరేటర్స్ కు ట్రాయ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్‌ కొత్త గైడ్‌లైన్స్‌‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది.బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను 19 నుంచి12కు తగ్గించింది. అలాగే నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు ను 130 గా నిర్ణయించింది. ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త  నిబంధనలను ఈ  నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ ఛానళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్‌సీఎఫ్‌లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసు కోవచ్చని తెలిపింది. దీన్ని ...

ఇక బందరుకు కొత్త కళ

చిత్రం
బందరు ఏపీకి కేరాఫ్ గా మారనుంది. వ్యాపార, వాణిజ్య పరంగా కొత్త రూపు సంతరించు కోనున్నది. ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకార ప్రాయంగా మారిన హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖ ద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో 4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు. గతంలో సముద్ర ముఖ ద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మే...

స్వేచ్ఛ కోసం నిరసన గళం

చిత్రం
హాంకాంగ్ నిరసనకారులతో అట్టుడికి పోయింది. గత కొంత కాలం నుంచి పెద్ద ఎత్తున చైనాకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, యువత ఉద్యమిస్తున్నారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్‌ వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్‌ స్ప్రే, టియర్‌ గ్యాస్, వాటర్‌ కెనాన్‌లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్‌ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమపై చైనా పెత్తనం ఎందుకంటూ ఇక్కడి జనం నిలదీస్తున్నారు. దీని వెనుక అమెరికా కుట్ర ఉందంటూ చైనా ఆరోపిస్తోంది. ఆ మేరకు అనుమానం వ్యక్తం చేస్తోంది కూడా. ఇదిలా ఉండగా హాంగ్ కాంగ్ సిటీ వరల్డ్ లో పేరొందిన నగరం. వ్యాపార...

జ్వాల వైరల్..ఫోటోలు హల్ చల్

చిత్రం
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఆట పరంగా కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన  ఫొటోస్ తో ఫ్యాన్స్ కు మరింత వేడి పుట్టిస్తోంది. తాజాగా ఈ ప్లేయర్ గుత్తా జ్వాల షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా విషెస్‌ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు షేర్‌ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్‌ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్‌ కూడా కనిపిండం లేదు. అంతే కాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్‌ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉందంటూ మరి కొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. వేరు వేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్‌ సర...