పోస్ట్‌లు

మహీంద్రాకు ఆనంద్ గుడ్ బై

చిత్రం
ఇండియాలో అత్యంత సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మిగతా కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్లు అంతా తమ వ్యాపారాలను ఎలా పెంచు కోవాలో చూస్తూ ఉంటే మహీంద్రా ఎండీ అండ్ చైర్మన్ ఆనంద్ మాత్రం సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. అంతే కాకుండా స్ఫూర్తి దాయకంగా ఉండే వాళ్లకు మహీంద్రా ఆర్ధిక తోడ్పాటు అందజేస్తున్నారు. ఇదే సమయంలో ఉన్నత వ్యాపార విలువలను పెంపొందిస్తూ కంపెనీని లాభదాయక బాటలో ఉండేలా తీర్చి దిద్దారు. దీంతో భారత దేశంలో ఆనంద్ టాప్ పొజిషన్ లో నిలిచారు. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ మేనేజ్‌‌మెంట్‌‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా ఉన్న ఆనంద్ర మహీంద్రా వైదొలుగుతున్నారు. ఆయనను కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా నియమించింది. ఈయన బాధ్యతలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్నాయి. పవన్ కుమార్ గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా మళ్లీ అపాయింట్ చేస్తూ.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్ప జెప్పింది. సీఈవో బాధ్యతలను త్వరలో చేపడతారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్స్‌‌ను అమలు చేయడమే లక్ష్యంగా సీఈవో పొజిషన్‌‌ను కంపెనీ క్రియేట్ చేసిం...

కొత్త దారులతోనే బలపడగలం

చిత్రం
పడిపోయిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, గ్రోత్‌‌కు సపోర్ట్ ఇచ్చేలా షార్ట్ టర్మ్‌‌లో పబ్లిక్ స్పెండింగ్‌‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పెంచవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. ఎక్కువ మొత్తంలో వెచ్చింపు కోసం ప్రభుత్వం కొత్త రెవెన్యూ మార్గాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 92వ యాన్యువల్ కన్వెన్షన్‌‌లో గీతా గోపినాథ్ మాట్లాడారు. ప్రైవేట్‌‌ రంగం డిమాండ్‌‌లో తీవ్ర స్లోడౌన్‌‌ ఉందని, ఇన్వెస్ట్‌‌మెంట్లు కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పారు. ఇండియా తన వాణిజ్య లోటును టార్గెట్‌‌ పరిధిలో ఉంచు కోవాలని సూచించారు. దీని కోసం ఖర్చులను రేషనలైజేషన్ చేయడం, రెవెన్యూలను పెంచు కోవడం చేయాలని గీత స్పష్టం చేశారు. ఒకవేళ పెట్టుబడులు అలానే బలహీనంగా ఉంటే, గ్రోత్‌‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత దేశానికి వాణిజ్య టార్గెట్ విషయంలో స్థిరత్వం ఎంతో అవసరమని ఆమె చెప్పారు. 2019 పూర్తి బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి, 2019–20వ ఆర్థిక సంవత్సర వాణిజ్య లోటు టార్గెట్‌‌ను 3.4 నుంచి 3.3 శాతానికి కుదించా...

అంకురాలకు ఆలంబన

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరంగా సపోర్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీ - హబ్ ను ఏర్పాటు చేసింది. మహిళలు ఆంట్రప్రెన్యూర్ గా ఎదిగేందుకు కావాల్సిన సహకారం అందిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా వీ హబ్‌‌ స్టార్టప్​ ఇండియా, డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్ ప్రమోషన్‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లతో కలిసి విమెన్‌‌ రైజింగ్ టుగెదర్ ప్రోగ్రామ్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలో ఏడాదికి 7,500 మంది విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో వింగ్ ప్రోగ్రామ్‌‌ వీ హబ్, కేరళ స్టార్టప్ మిషన్ సహకారంతో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్‌‌ ద్వారా ఇంక్యుబేషన్‌‌ను, ఇన్వెస్టర్లను పొందడంలో విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందిస్తారు. వీటితోపాటు వారి బిజినెస్‌‌కు మద్దతిస్తారు. 2017 లో హైదరాబాద్‌‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత వీ హబ్‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్న ఏడాదిన్నర లోనే వీ హబ్‌‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని విమెన్‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు సహాయం అందజేస్తోంది. విమెన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు...

భాగ్యనగరమే బెటర్

చిత్రం
ఇండియాలో అన్ని ప్రాంతాల కంటే మన భాగ్యనగరమే బెటర్ అంటున్నారు పలువురు వ్యాపారవేత్తలు. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, తదిర రంగాల కంపెనీలన్నీ ఈ సిటీనే ఎంచుకుంటున్నాయి. ఓ వైపు దేశం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇంకో వైపు వ్యాపార, వాణిజ్య, ఆటోమొబైల్ రంగాలన్నీ తీవ్ర ఒడిడుకులు లోనవుతున్నాయి. ఆర్ధిక మంద గమనం దెబ్బకు వ్యాపారవేత్తలు లబోదిబోమంటున్నారు. ఎకనామిక్ స్లో డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంటే హైదరాబాద్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏటా ప్రాపర్టీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2019– 2020 ఆర్థిక సంవత్సరంలో మన సిటీలో ప్రాపర్టీ రేట్లు 17 శాతం మేర పెరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి  నుంచి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూనే ఉంది. రెసిడెన్షియల్ తోపాటు కమర్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్ లో కమర్షియల్ లీజింగ్ 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల నుంచి 90 లక్షల చదరపు అడుగుల వరకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మెరుగు పడటం, వర్కింగ్ ప్రొఫెషనల్...

దివాలాకు లైన్ క్లియర్

చిత్రం
భారతీయ విమానయాన రంగం తీవ్ర ఒడిడుకులు లోనవుతోంది. జెట్‌ ఎయిర్‌ వేస్‌ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ రుణ దాతల కమిటీ దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కార్పొరేట్‌ దివాలా పరిష్కార గడువు ముగిసింది. అయితే ఈ గడువును పొడిగిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్‌ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. ముంబై కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ పనిచేస్తోంది. ఇండియాలో ఇండిగో ఎయిర్ లైన్స్ తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా జెట్ గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపిస్తోంది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ 1992 ఏప్ర...

పౌర సమాజం ధర్మాగ్రహం

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశమంతటా వివిధ వర్గాలకు చెందిన పౌరులు, ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు నటీ నటులు సైతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేశం ప్రస్తుతం అగ్ని గుండంగా మారింది. వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఆందోళనలతో అట్టుడికింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌, కాన్పూరు లో ఒక్కరు చొప్పున చనిపోయారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్‌ నుంచి బులంద్‌షహర్‌ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఢిల్లీలో జాతీయ పతాకం చేత పట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్...

వికేంద్రీకరణతోనే పురోభివృద్ధి

చిత్రం
పాలనా పరంగా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ మెంట్ జరిగేలా చూడాలని కోరింది. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌  ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్‌ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది....