పోస్ట్‌లు

మనోడికి కోటిన్నర ఆఫర్

చిత్రం
తెలంగాణకు చెందిన కుర్రాడు సాయి చరిత్ రెడ్డి తన సత్తా చాటాడు. ఏకంగా కోటిన్నర వార్షిక వేతనాన్ని పొందాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ కుర్రాడు. ఏదో తరగతి వరకు నల్లగొండ లో చదివిన ఈ కుర్రాడు జాక్ పాటు కొట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఐఐటీ బాంబే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ స్టూడెంట్ ఓ చరిత్రను క్రియేట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రో సాఫ్ట్ లో జాబ్ దక్కించుకున్నాడు. ఎంతో మంది పోటీలో ఉన్నా ఇతనొక్కడినే కంపెనీ ఎంపిక చేసుకుంది. అంటే ఇతడి సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 11 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. ఇందులో ముగ్గురిని మాత్రమే కంపెనీ ఎంపిక చేసింది. స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మపురం. ముందు నుంచి ఇంజనీరింగ్ అంటే ఇష్టం. అందుకే ప్రతి పరీక్షలో టాప్ లో ఉంటూ వచ్చాడు. అన్ని టెస్టుల్లో సెలెక్ట్ అవుతూ రాణించాడు ఈ కుర్రాడు. స్వంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. నిరంతరం ఇన్ఫర్మేషన్ సేకరించడం, మెంటార్స్, లెక్చరర్స్ తో డిస్కస్ చేయడం చేస్తూ వచ్చాడు. మాక్ టెస్టులకు కూడా అటెండ్ అయ్యాడు. జేఈఈ అడ్వాన్స్ లో 51...

కష్టాల్లో ఇన్ఫోసిస్

చిత్రం
ఐటీ సెక్టార్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న ఇన్ఫోసిస్ కంపెనీని ఆరోపణలు వెంటాడుతున్నాయి. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫోసిస్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్‌ లా ఫర్మ్‌ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్‌ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్‌ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపునకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్‌పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో సలిల్‌ పరేఖ్‌ తప్పించారని షాల్‌ ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్‌ లొసుగులు, వివాదాస్పద డీల్స్‌ వివరాలను ఆడిటర్లు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్ల నివ్వకుండా ఫైనాన్స్‌ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందర్నీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన తర్వాత.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది అని షాల్‌ పేర్కొంది. 1,00,000 డాలర్ల పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. క్లాస...

అమ్మకానికి ఎయిరిండియా

చిత్రం
ఇప్పటికే ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెట్టిన మోదీ సర్కార్ తాజాగా ఎయిరిండియాపై కన్నేసింది. భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డది. దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నష్టాల నెపం పేరుతో లాకవుట్ ప్రకటించడంతో లేదా మూసి వేయడమే లేదా ఇతర కంపెనీలకు దారాదత్తం చేయడమో చేస్తూ వస్తోంది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. దేశీయ విమానయాన రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎయిరిండియా సంస్థ ప్రమాదంలో చిక్కుకుంది. మోయలేని భారంగా మారడంతో ఇక అమ్మడానికి రెడీ అవుతోంది కమల ప్రభుత్వం. అందరూ ఊహించినట్లుగానే చావు కబురు చల్లగా చెప్పారు మంత్రివర్యలు. నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు ఆయన లోక్‌సభకు రాత పూర...

వినోద రంగంలో విప్లవం

చిత్రం
ఇండియన్ వినోద రంగంలో ఇదో కీలక పరిణామం. ఒక రకంగా ఈ వార్త సెన్సేషన్ అనే చెప్పక తప్పదు. దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ముందుగా డిష్‌ టీవీ తన డీటీహెచ్‌ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుంది. ఈ మేరకు విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్‌ టు హోమ్‌ టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం ఏర్పడుతుంది.  87 శాతం మార్కెట్‌ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల...

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

చిత్రం
దేశంలోనే అత్యుత్తమైన రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏ మేరకు సిటిజన్షిప్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది మరింత వేడిని రాజేసింది. దేశమంతటా వైరల్ గా మారింది. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత ప్రాధాన్యత చేసుకున్నాయి. పీకేకు మేధావిగా, వ్యూహకర్తగా ఎంతో పేరుంది. ఆయన ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు అధికారంలోకి రావడం ఖాయంగా మారింది. దీంతో ఇండియాలో విస్మరించలేని నాయకుడిగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కోసం దేశాన్ని ప్రభివితం చేస్తున్న నాయకులూ, ఆయా పార్టీల నేతలు ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకున్నారు. కాగా ఇటీవల ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలో చేరారు. తాజాగా తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు పీకే సపోర్ట్ చేయనున్నట్టు సమాచారం. ఎన్ని ఆందోళనలు జరిగినా, అభ్యంతరాలు చోటు చేసుకున్నా పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు నెగ్గింది. భారత రాష్ట్రపతి సంతకం కూడా చేశారు. ఈ బిల్...

దిశ బాధ్యత కమిషన్ దే

చిత్రం
దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాటాన్ పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు  ముగ్గురు సభ్యులతో కూడిన ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్‌కార్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా బల్దౌతాలతో పాటు సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌లతో కూడిన ఈ బృందం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తుందని, ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ట్రైమెన్‌ కమిషన్‌లో ఒకరైన కార్తికేయన్‌ గతంలో సిటీలోని సీఆర్పీఎఫ్‌ యూనిట్‌ ఐజీగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించారు. అప్పట్లో ఈ దర్యాప్తునూ హైదరాబాద్‌ కేంద్రంగానే నిర్వహించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌లో మానవబాంబు దుశ్చర్యకు రాజీవ్‌ గాంధీ మృతి చెందారు. అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్‌ భీష్మనారాయణ్‌ సింగ్‌ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించే బాధ్యతలను ఐపీఎస్‌ అధికారి డీఆర్‌ కార్...

అస్సాంలో ఆగ్రహజ్వాల

చిత్రం
పార్లమెంట్‌ సాక్షిగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు నిలిపి వేశారు. సైనికులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. ఇంటర్నెట్‌ సేవలపై మరో 48 గంటల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్‌పై నిషేధం ఉండగా ట్విట్టర్‌లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చే...