పోస్ట్‌లు

రోగుల పాలిట దేవత ..ఎందరికో స్ఫూర్తి ప్రదాత

దేశంలో ఐటి రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రాంతంగా హైదరాబాద్ దూసుకు వెళుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు లాజిస్టిక్ , హెల్త్ , ఈ కామర్స్ , టెలికాం , ఆయిల్ , ట్రాన్స్ పోర్ట్ , నిర్మాణ , రియల్ ఎస్టేట్ , తదితర రంగాలలో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటి సెక్టార్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా చితికి పోతున్నారు. తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. దీంతో సోషల్ , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కు , సైకాలజీ లో అనుభవం కలిగిన వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, బిహేవిరియల్ , టెన్షన్ ఫ్రీగా ఉండేందుకు ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వివిధ సంస్థల్లో సలహాదారులుగా, పర్మినెంట్ గా పని చేస్తున్నారు. పలు వ్యక్తిగత సమస్యలతో సతమత మయ్యే వారికి స్వాంతన చేకూరుస్తున్నారు. దైనందిన జీవితంలో వత్తిళ్ల నుండి అధిగమించేందుకు ఆయా ప్రధాన హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా బాధితుల కోసం సెంటర్స్ ను నెలకొల్పారు. హైదరాబాద్ లో చాలా మంది ట్రైనర్స్ వేలాద...

హనుమ విహారం ..అద్భుత శతకం

చిత్రం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తీసుకున్న డెసిషన్ తప్పు కాదని తేలిపోయింది. నిన్నటి దాకా ముంబై లేదా కోల్ కత్త వారిదే డామినేషన్ నడిచింది. గత కొంత కాలంగా తెలుగువాడైన ఏపీకి చెందిన ప్రసాద్ అత్యున్నతమైన, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించాడు. ఇది జీర్ణించు కోలేని ముంబై పరివారం అతడిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందులో మొదటి వ్యక్తి మాజీ సారధి సునీల్ గవాస్కర్. అయినా పట్టించు కోవాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేశాడు ప్రసాద్. హనుమ విహారికి ప్రసాద్ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విహారి వమ్ము చేయలేదు.  విండీస్ టూర్ లో హనుమ  అత్యున్నతమైన ప్రతిభ చూపాడు. గతంలో హైదరాబాద్ అంటే పటౌడీ, శివలాల్ యాదవ్ , అజహరుద్దీన్ , లక్ష్మణ్ , అర్షద్ అయూబ్, వెంకట పతి రాజు, అంబటి రాయుడు , ఇలా చాలా మంది ఇండియన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా హనుమ విహారి ఇప్పుడు రాణిస్తున్నాడు. కాగా రాయుడు ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించాడు. తిరిగి మళ్ళీ ఆడుతానంటూ వెల్లడించాడు. ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి విహారి వైపు మొగ్గు చూపార...

వెంటాడే జ్ఞాపకం..పూసిన మందారం..!

చిత్రం
పిచ్చి వాళ్ళను చూడాలని ఉందా..? అయితే ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే సినిమా రంగం ఉందిగా . అక్కడ చదువుతో పని లేదు. కావాల్సినంత సరుకుంటే చాలు. మీకు మీపై నమ్మకం, క్రియేటివిటీ  ఉంటే చాలు. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతాయి. టెక్నాలజీ పుణ్యమా , డిజిటల్ మీడియా రంగం వచ్చాక సీన్ మారింది. ఇక్కడ ఒక్కరిదే రాజ్యం కాదు..అందరీదీనూ. ఎవరికి వారే కింగ్ లు . తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే ఛాన్స్ ఉంటోంది. ప్రతి రంగంలో ఉన్నట్లే ఇక్కడ కూడా హీరోయిన్లు, ఇతర పాత్రల్లో నటించే మహిళలు వివక్ష ఎదుర్కుంటున్నారన్న విమర్శలున్నాయి. తన వారు సినీ రంగంలో ఉన్నప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది .  వరలక్ష్మి శరత్ కుమార్. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్ళు . ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం అలవాటు. కన్నడ, తమిళ్, మలయాళం లలో నటిస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా ఆమె సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. ట్విట్టర్ లో , ఇంస్టా గ్రామ్ లో వరలక్ష్మికి ఫాలోయింగ్ ఎక్కువ. నటిగా , డ్యాన్సర్ గా ..జంతు ప్రేమికురాలు, ఫెమినిస్ట్. సేవ చేసేందుకు స్వంతంగా సేవ్ శక్తి ని ఏర్పాటు చేశారు. మైక్రోబయోలజీలో డిగ్రీ , ఎడిన్ బ...

కాసులు కురిపిస్తున్న ఐడియా..!

చిత్రం
దునియాలో ఒకప్పుడు బతకాలంటే సవాలక్ష ఇబ్బందులు. ఇప్పుడు అలాంటి కస్టాలు ఏమీ లేవు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ప్రపంచం చిన్నదై పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. రా రమ్మంటూ ఊరిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వేచి చూడటమే మిగిలి ఉన్నది. సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న పెను మార్పుల దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమై పోయాయి. వేలాది మందికి కొలువులు దక్కుతున్నా, ఆశించినంతగా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వేలాదిగా స్టార్ట్ అప్ సంస్థలు పుట్టుకు వచ్చాయి. ప్రారంభంలో చిన్న గదుల్లో స్టార్ట్ అయి..నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే రోజు రోజుకు చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. ఐటి, ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా , టెలికం, ఆయిల్ , జ్యూయలరీ , ట్రాన్స్ పోర్ట్ తదితర రంగాలలో పని చేస్తున్న వారు అభద్రతకు లోనవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో కంపెనీల ఏర్పాటు అన్నది భారీ ఖర్చుతో  కూడుకున్నది. కోట్లాది రూపాయలతో పాటు ఒక్కోసారి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి ఎక్కువ కావడం, ఉద్యోగాల ...

ఇక చాలదా నీ జీవితానికి..!

చిత్రం
మనకో వేదిక కావాలి ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న ప్రచారం కావాలంటే మనకో గ్రూప్ ఉండాలి అందుకు సరిపడినంత లౌక్యం కావాలి  అప్పుడేగా కర్చు లేకుండా అభిమానులు దొరికేది అబ్బో యెంత ఫాలోయింగో అనుకుంటూ మనం ఆక్షర్యానికి గురవుతాం..అంతలోనే మనకెందుకు అనుకుంటూ సాగిపోతాం ..! ఎవరి దారులు వాళ్ళవి ఎవరి లోకంలో వాళ్ళు లోపట ఒకటి ..బయట మరొకటి మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు మరి మనను గుర్తించాలంటే వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే మనకూ ఓ సమూహం కావాలి అది మనతో పాటే సాగేలా మన కనుసన్నలలో ఉండేలా చూసుకోవాలి ...అప్పుడేగా లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు ఇంకాస్తా ముందుకు వెళితే అహో అంటూ కితాబులు ..! నువ్వు కవి కాదల్చుకున్నవా తక్కువ కాలంలో గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో నీ పేరు మారు మోగాలా అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు నీ గురించి పతాక స్తాయిలో గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు కాస్తంత లౌక్యం ఉంటె సరి ఇంకెందుకు ఆలశ్యం రండి ..పైసా ఖర్చు లేకుండా మహా కవి కాదల్చుకున్నవా ..! అయితే వెంటనే ఓ వేదిక చూసుకో నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో నిన్ను ప్రశించే వాళ్ళు లేకుండా చూసుకో ఇక..నీవొ...

బ్యాంకుల విలీనం ..ఉద్యోగులు గరం గరం..!

చిత్రం
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ తీరుపై ఇప్పటికే జనం అసంతృప్తితో వున్నారు. పుండు మీద కారం చల్లినట్లు గతంలో మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయింది. కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వృద్ధి రేటు పడి పోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేసుకుంటున్న సర్కార్, ఆచరణలోకి వచ్చే సరికల్లా అమలు కావడం లేదు. ఇప్పటికే చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఈరోజు వరకు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. తాజాగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులను బదిలీ చేసింది. దీంతో ఇండియన్ ఎకానమీ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంకో వైపు తమ అనుమతి, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్ధిక మంత్రి బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయం తీసు కోవడంపై ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల...

అమరావతిపై రాద్ధాంతం ..బాధితులు ఆందోళకరం

చిత్రం
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాద్ధాంతం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడైతే సందింటి జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో, ఆనాటి నుంచి ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి , మంత్రి బొత్స సత్యనారాయణలు ఇప్పటికే కేపిటల్ సిటీగా అమరావతి సరైనది కాదని, దాని స్థానంలో ఇంకో ప్రాంతాన్ని ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక విజయసాయి రెడ్డి అయితే, ఏకంగా ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా కు తెలిసే జరుగుతోందంటూ కొత్త ట్విస్ట్ కు తెర లేపారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు, బాధితులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కలిశారు. ఈ విషయంపై పవన్ అమరావతి విషయంలో బొత్స పై ఫైర్ అయ్యారు. దానిని మార్చవద్దంటూ కోరారు. అంతే కాకుండా బాధితులతో సమావేశ మయ్యారు. బొత్స ముందు వెనుకా అలోచించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు సైతం ఎట్టి పరిస్తతుల్లోనూ అమరావతినే కేపిటల్ సిటీగా ఉంచాలని, మార్పులు చేస్తే తీవ...