పోస్ట్‌లు

భాషా కోవిదుడికి జగన్ బహుమానం ..!

చిత్రం
తెలుగు బాష అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే పేరు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయన ఏది మాట్లాడినా అది వినసొంపుగా ఉంటుంది. సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదుడిగా, సకల కళా వల్లభుడిగా, రాజస్య భాషకు ప్రేమికుడిగా..కళా పిపాసిగా, చేయి తిరిగిన రచయితగా ఆయనకు పేరుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి సరైన సమయంలో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా అపారమైన అనుభవం కలిగిన యార్లగడ్డకు అరుదైన కానుకను అందించారు. ఏకంగా ఏపీ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నియమించారు. దీంతో తెలుగు భాష పట్ల సీఎం కు ఉన్న అభిమాననాన్ని చాటుకున్నారు. ఆయన మాట్లాడితే ఇంకా వినాలని అనిపిస్తుంది . విషయాన్నీ పూస గుచ్చినట్లు చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది. సభను నడిపించాలన్నా, సక్సెస్ చేయాలన్నా యార్లగడ్డ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎందరో. ఆయన నిత్యా పాఠకుడు. మంచి వక్త. అంతకు మించి ప్రయోక్త ..రచయిత. కవి ..అనువాదకుడు ..రాజకీయ నాయకుడు ..ఇంకా చెప్పాలంటే తెలుగు సంస్కృతి , సాంప్రదాయం , నాగరికత అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఈ అరుదైన పదవి దక్కడం వల్ల రాబోయే రోజుల్లో మాతృ భాషకు మంచి రోజులు వస్తాయని భా...

పాటగాడిపై ఏఐసిఏ నిషేధం ..?

చిత్రం
ఇండియన్ పాప్ స్టార్.. మోస్ట్ పేవరబుల్ సింగర్ గా పేరొందిన మీకా సింగ్ పై వేటు పడింది . భారత ..పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మీకా ఆ పాక్ లో పర్యటించడం, ప్రదర్శన ఇవ్వడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మీకా సింగ్ పై నిషేధం విధించింది. తాజాగా కరాచీ నగరంలో పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ పర్వేశ్ ముష్రాఫ్ సమీప బంధువు కోసం మీకాసింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మీకా తన పాటలతో అలరించారు . జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో దాయాది దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సమస్యలు నెలకొన్నాయి . ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి .వాస్తవాధీన రేఖ వెంట సైనికులను మోహరించాయి. ఈ సమయంలో ..దేశం అంతటా స్వతంత్ర దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న వేళ మీకా సింగ్ ఎందుకిలా చేశారని అభిమానులు వాపోతున్నారు. మీకా సింగ్ ఎక్కడికి వెళ్లినా సరే వేలాది మంది అభిమానులు చుట్టుముడుతారు. మోస్ట్ పాపులర్ సింగర్ గా ఇప్పటికీ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు. అంటే అతడికున్న ఫాలోయింగ్ అలాంటిది. ఇండియాలోని పలు భాషల...

న్యూ బిజినెస్ లోకి ఎమ్మెస్ ఎంటర్ ..!

చిత్రం
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని పెద్దలు చెప్పిన మాటల్ని నిజం చేస్తున్నారు మనం ఆరాధించే క్రికెటర్లు. పేరుకు దేశం కోసం ఆడుతున్నామని చెబుతున్నా కొందరు ఆటగాళ్లు మినహా అంతా మనీ మీదే ధ్యాస పెడుతున్నారు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ ఆదాయం కలిగిన క్రీడా సంస్థ ఏదైయినా ఉంది అంటే అది ఒక్క బీసీసీఐనే. ఇప్పటికే వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది ఈ సంస్థకు. భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ఇటీవల అమెరికా సంస్థ ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ఆదాయం గడించే భారతీయ ఆటగాళ్లలో టాప్ లో నిలిచారు. ఆయన ఆదాయం నెలకు వందల కోట్లను దాటింది. మరో వైపు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనికి మిస్టర్ కూల్ గా పేరుంది. వివిధ రంగాలలో , వ్యాపారాలలో భారీ ఎత్తున ప్రకటనల రూపేణా సంపాదిస్తూ వస్తున్నారు . ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళా ఉంటుందన్న వాస్తవాన్ని ఇండియన్ క్రికెటర్లు ఆచరణలో నిజం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు మిగతా అఆటగాళ్లు సైతం సరిలేరు మాకెవ్వరు అంటూ చేతినిండా నింపేసుకుంటున్నారు. ఎప్పుడు ఉంటామో ఇంకెప్పుడు ఉండమో తెలియని పరిస్థితుల్లో , వచ్చిన అవకాశాలను ఎందుకు వదిలేసి కోవాలని , ముం...

ఆర్‌ఐఎల్‌ అదుర్స్ ..మార్కెట్ జోష్..!

చిత్రం
డబ్బులు ఊరికే రావు..ఇది ఇటీవల తెలుగు వాకిళ్ళల్లో ..బుల్లి తెరను వీక్షించే వారందరికీ తెలిసే ఉంటుంది. ఒక సేల్స్ మెన్ గా జీవితాన్ని ప్రారంభించి, వేలాది మందికి జీవనోపాధిని అందిస్తున్న ఓ సాధారణ వ్యక్తి సాధించిన అపురూప విజయానికి కొండ గుర్తు. కొలువులు లేవని భాధ పడుతూ కూర్చోవడం కంటే కాలాన్ని ఒడిసి పట్టుకుని ముందుకు దూసుకు వెళితే ఎన్నో గెలుపులు స్వంతమవుతాయి. వందలాది మంది విజేతలంతా మన కళ్ళ ముందే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా స్మార్ట్ ఫోన్లలో గడిపే వాళ్లకు వీరి జీవితాలు కనువిప్పు కావాలి . చదువు కోవడం అంటే పుస్తకాలనో లేదా నోట్స్ నో ఆ పూటకు చదివి పాసవుతే అది గొప్ప సక్సెస్ అనుకుంటే పొరపాటు పడినట్లే .  గెలుపు అంటే ఇతరులకంటే భిన్నంగా ఆలోచించడం. ఎవరూ వెళ్లని దారులలో ప్రయాణించడం. పొద్దస్తమానం అమెరికా జపం చేసే ప్రబుద్దులకు దేశీయంగా ఉంటూనే అసాధారణమైన విజయాలు అందుకున్న వారిని చూసి నేర్చుకోవాలి. ఈ దేశం కోసం రేయింబవళ్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుల ముందు మన జీవితాలు ఏపాటివి. నిన్నటి దాకా అప్పుల్లో కూరుకు  పోయిందని రిలయన్స్ మీద అపనమ్మకం పెంచుకుంటూ వచ్చిన మార్...

తమిళ నాట తలైవా సంచలనం..!

చిత్రం
ఇండియాలో తమిళుల రూటే సపరేట్. వాళ్లకు ఆవేశం వచ్చినా లేక ఆవేదన వచ్చినా తట్టుకోలేరు. వారికున్నంత ఆత్మాభిమానం ఇంకెవ్వరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమా స్టార్స్ కు ఉన్నంత ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లు కు ఉండదు . వీరే వారిని శాశిస్తారు ..అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎంజీఆర్ , కరుణానిధి , జయలలిత ..ఇలా తమిళ గత కొంత కాలంగా సాగుతూ వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ , వైగో లాంటి వాళ్ళున్నారు. దేశమంతటా బీజేపీ గాలి వీచినా తమిళనాట ఇంకా పాగా వేయలేక పోతోంది.  ట్రబుల్ షూటర్ అమిత్ షా కన్ను మదరాసు మీద పడింది.  ఎలాగైనా సరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఆయన ప్లాన్. ఇందు కోసం కలిసి వచ్చే వారి కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు . తాజాగా భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ సందర్బంగా అమిత్ షా ప్రత్యేకంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు . కానీ ఒకే ఒక్కరు మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్ట్రాక్షన్ గా నిలిచారు . అతను ఎవరో కాదు లక్షలాది మంది కి ఆరాధ్య దైవంగా పిలుచుకునే రజనీకాంత్ ఉరఫ్ తలైవా. కొద్ది సేపు షా ..రజని ముచ్చటించుకున్నార...

అబ్బా..రిలయన్స్..దెబ్బ ..ఇక టెక్నలాజి వార్

చిత్రం
భారతీయ సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి నంది పలకబోతోంది ..రిలయన్స్ సంస్థ. మార్కెట్ వర్గాలను విస్మయ పరిచేలా సదరు కంపెనీ అధినేత సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఇక వచ్చే నెల నుంచి జియో ఫైబర్ ను అందుబాటులోకి ఈసుకు రానుంది. దీంతో ఒకే ఒక్క కనెక్షన్ ఉంటే చాలు ..ఇక ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ అన్నీ తక్కువ ధరకే వాడుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు . ఈ ఒక్క ప్రకటన తో ప్రతార్తి కంపెనీలు షాక్ కు లోనయ్యాయి. ఇప్పటికే టెలికం రంగంలో 34 కోట్లకు పైగా కస్టమర్లతో చరిత్ర సృష్టించింది రిలయన్స్. ప్రతి ఇంటా సాంకేతిక విప్లవం తీసుకు రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమంటూ ఇటీవల జియో ను ప్రారంభించినప్పుడు ముఖేష్ అంబానీ ప్రకటించారు . ఆ దిశగా ఆయన తన ప్రణాలికను పక్కాగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు . ఇది ఓ రకంగా భారతీయ ఆర్ధిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని మార్కెట్ రంగాల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఉచితంగా టీవీ కనెక్షన్‌, దేశంలో ఎక్కడికైనా పైసా ఖర్చులేకుండా మాట్లాడుకునేలా ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌,  ఒకేసారి దేశ విదేశాల్లోని నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది . అంతే కాకుండా సి...

అంపశయ్యపై ఆర్టీసీని ఆదుకోలేమా..?

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించడమే కాదు ...రెండు నెలల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఘనత ఆర్టీసీ కార్మికులదే. రాష్ట్రం ఏర్పడినా ఈ రోజు వరకు ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు . రోజు రోజుకు  నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ..నష్టాల నుంచి గట్టెక్కించేందుకు గట్టి చర్యలు చేపట్టడం లేదని కార్మికులు, యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి పూర్వ వైభవం రావాలంటే ముందు ఆ సంస్థలో ఏళ్ళ కొద్దీ తిష్ట వేసుకుని కూర్చున్న వారిని తొలగించాల్సి ఉన్నది. ప్రతి ఏటా బస్సులపై భారం పడుతోంది . ఖాళీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బనుడిలా దృష్ట్యా కొత్త వారిని తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ఉన్న వారితోనే పని చేయించుకుంటున్నారు . వయసు పైబడిన వారు, రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న వారు ఎక్కువ గా ఉన్నారు . వీరిపై పని భారం అధికం అవుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . కార్మిక చట్టాలు ఇక్కడ అమలు కావడం లేదు . ప్రభుత్వం తమ గురించి పట్టించు కోవడం లేదంటూ కార్మికుల...