జనం కోసం జీవితం - ప్రజా సేవకు అంకితం - మరికంటి భవానీ రెడ్డి ప్రస్థానం
తెలంగాణ ఎన్. ఆర్. ఐలలో మరికంటి భవానీ రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. ఆంట్రప్రెన్యూర్ గా , తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమె అందరిని కూడగట్టింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తన వంతు కృషి చేసింది. తెలంగాణ సాధనలో మమేకమైన వారిలో కొందరికి వెన్ను దన్నుగా నిలిచింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన భవానీ రెడ్డి కుటుంబానికి చెప్పుకోదగిన చరిత్ర వున్నది. మాటివ్వడం..ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం కోసం అలుపెరుగకుండా కృషి చేయడం ఆమె నైజం. అందరి మహిళల లాగానే ఆమె కూడా కష్టాలను దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఏకంగా తన స్వంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఆర్టీసీ సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని పెద్ద మునగాల్ చేడ్‌కు చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. భర్తకు చేదోడు వాదోడుగా వుంటూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నది. తనతో పాటు మరికొందరు మహిళలను భాగస్వాములయ్యేలా చేసింది. బతుకు దెరువు కోసం కుటుంబంతో సహా ఆస్ర్టేలియాకు వలస...