ఫ్యాన్స్ కోసం సంగీతోత్సవం

బిగ్ బాస్ - 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ సరికొత్త ప్రోగ్రాం కు తెరతీశారు. మాటీవీలో బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరొందిన బిగ్ బాస్ ను సక్సెస్ చేయడమే కాకుండా తనకు మంచి పాపులారిటీ వచ్చేలా చేసినందుకు, వారికి గుర్తుగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ వెల్లడించారు. కొండాపూర్‌లోని సౌండ్‌ గార్డెన్‌ కేఫ్‌లో ‘లైవ్‌ కన్సర్ట్‌’ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. 29న పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు.

ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్‌ బాస్‌–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్‌ మ్యాన్‌ను అన్నారు. సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక, 2013 నుంచి మ్యూజిక్ వీడియోస్‌ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్న మొన్న గుర్తింపు వచ్చిందన్నారు.

సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్‌కు చెందిన ఓ సింగర్‌ సొంత పాటలు సోలోగా పాడ బోతున్నాడని తెలిపారు. టాలెంట్‌ సింగింగ్‌తో కృతజ్ఞతలు తెలియ జేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు బాగా ఆదరించారని చెప్పారు. బిగ్‌బాస్‌–3లో తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్‌గా ప్రజెంట్‌ చేసినందుకు మీడియాకు థాంక్స్ తెలిపారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తో రాహుల్ కు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!