పిల్లల పాలిట దేవుడు ఈ కలెక్టర్
మనసుంటే మార్గాలు ఎన్నో. కావాల్సిందల్లా సంకల్పం. మనుషుల పట్ల కాసింత అభిమానం. చాలా మంది కలెక్టర్లు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరైతే దైవాంశ సంభూతులుగా భావిస్తారు. కానీ కష్టపడి పైకి వచ్చి..జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన వారిలో ఎలాంటి డాబూ..దర్పం ఉండదు. సింపుల్ గా వుంటారు..ప్రజలను ప్రేమిస్తారు. వారి కోసం ఏమైనా చేయాలని తపనతో ఉంటారు. అలాంటి వారిలో కోవే ఒకరు. ఈ కలెక్టర్ ఏకంగా జనంతో కలిసి కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మోక్షం కల్పించారు. ప్రపంచం ఈ కలెక్టర్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. కొందరు అధికారులు జనంతో, అధికారులతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడరు. కానీ వరంగల్ జిల్లా అర్భన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ భిన్నంగా ఆలోచించారు. కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం మొత్తం ఆశ్చర్య పోయేలా ..మిగతా జిల్లాల కలెక్టర్లు నివ్వెర పోయేలా చేశారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ పిల్లలతో కలెక్టర్లు ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడలేని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రకంగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన...