పోస్ట్‌లు

క‌రోనా క‌ల్లోలం..దేశం అల్ల‌క‌ల్లోలం

చిత్రం
క‌రోనా దెబ్బ‌కు ఇండియా అల్లాడుతోంది. ఇప్ప‌టికే కేసులు వంద‌లు దాటి వేయి వ‌ర‌కు వ‌స్తున్నాయి. దీంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్న భార‌త ప్ర‌భుత్వం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీజీ ఏప్రిల్ 14 వ‌ర‌కు ష‌ట్ డౌన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో కోట్లాది మంది ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అన్ని రాష్ట్రాలు పూర్తిగా క్లోజ్ చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా చాలా వ‌ర‌కు కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా కంట్రోల్ చేయ‌గ‌లిగితే అమెరికా మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మొద‌ట్లో దీనిని లైట్‌గా తీసుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ ..దీని దెబ్బ‌కు రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండ‌డంతో గ‌త్యంత‌రం లేక ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అంతే కాకుండా ఈ వైర‌స్ ను వ్యాప్తి చెందేలా చేసిన చైనాను ఆయ‌న టార్గెట్ చేశారు. త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్ధేశంతోనే చైనా ఇలా చేసిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో రంగంలోకి దిగిన డ్రాగ‌న్ చైనా అమెరికాపై మండి ప‌డింది. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోకుంటే బాగ...

క‌నిపిస్తే కాల్చివేత..ఇండియా ష‌ట్ డౌన్

చిత్రం
ప్ర‌పంచం ఒకే ఒక్క వైర‌స్ ను చూసి వ‌ణుకుతోంది. 195 దేశాల‌కు విస్త‌రించిన ఈ మ‌హ‌మ్మారి కోట్లాది ప్ర‌జ‌ల‌ను, దేశాధినేత‌ల‌ను, పాల‌కుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. అంతే కాదు ఏ స‌మ‌యంలో ఎవ‌రిని కాటేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వైర‌స్ దెబ్బ‌కు జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో ముందంజ‌లో ఉన్నా ప్ర‌పంచాన్ని శాసించే పెద్ద‌న్న అమెరికా సైతం క‌రోనాను చూసి జ‌డుసుకుంటోంది. దీని ప్ర‌భావం ఏ మేర‌కు ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఇట‌లీని క‌మ్మేసిన ఈ భూతం దెబ్బ‌కు ప్ర‌ధాన దేశాల‌న్నీ విల‌విల‌లాడుతున్నాయి. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అంటూ ఇక్క‌డ కూడా పాకింది. ఇప్ప‌టి దాకా క‌నీసం 500 మందికి పైగా ఈ వ్యాధిన బారిన ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు కేంద్ర‌, రాష్ట్రాలు నీళ్ల‌ల్లా ఖ‌ర్చు చేస్తున్నాయి. సాక్షాత్తు భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర‌దాస్ మోదీజీ, ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ లు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించ‌గా కేసీఆర్ ఏకంగా క‌నిపిస్తే కాల్చివేత‌కు ఆదేశాలు జారీ చే...

శ్రీ‌కృష్ణం..ప్ర‌భుపాదం

చిత్రం
కృష్ణా నీవే అంటూ హ‌రిహ‌ర‌న్ పాడుతుంటే మ‌న‌సు అలౌకిక‌మైన దారుల్లో సంచ‌రిస్తుంది. ఉన్నాడో లేడో తెలియ‌ని సందిగ్ధావ‌స్థ స్థితిలోంచి కోట్లాది జ‌నాన్ని భ‌క్తులుగా మార్చిన ఘ‌న‌త ఆ కృష్ణుడిదే. వెన్న దొంగ‌గా, ఆరాధ్య దైవంగా వినుతికెక్కిన ఆయ‌న బోధించిన భ‌గ‌వ‌ద్గీత ఇవాళ ప్ర‌తి ఇంట్లోకి చేరిపోయింది. ఎంత‌లా అంటే విడ‌దీయ‌లేనంత‌గా. ప్ర‌తి చోటా..ప్ర‌తి నోటా కృష్ణా అన్న ప‌ద‌మే విన‌సొంపుగా..విన‌మ్రంగా..విశ్వ వ్యాప్తంగా..నిత్యం..నిరంత‌రం..లోక‌మంత‌టా వినిపిస్తోంది. ఎలాంటి భేష‌జాలు లేకుండా..అహం అన్న‌ది ద‌రిచేర‌కుండా మ‌నుషులుగా ఎలా ఉండాలో..ఎలా వ్య‌వ‌హ‌రించాలో..ఎలా బ‌త‌కాలో బోధించారు..కోట్లాది భ‌క్తుల‌కు త‌న ప్ర‌వ‌చ‌నాల ద్వారా సందేశాల‌ను చేర‌వేశారు. ఈ ప్ర‌పంచ గ‌తి శీల‌త‌ను మార్చిన సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని సంస్క‌రించిన మ‌హానుభావులు ల‌క్ష‌లాది మంది ఉన్నారు. వారిప్పుడు భౌతికంగా లేరు. కానీ వారు సూచించిన మార్గాలు, వారు న‌డిచిన అడుగు జాడ‌ల‌న్నీ నేటికీ స్ఫూర్తిని క‌లిగిస్తున్నాయి. దైవం స‌మానం..కానీ మ‌న మ‌న‌స్సులు మాత్రం ఒక చోట కుదురుగా ఉండ‌వు. ఉండ‌లేవు కూడా. ఎందుకంటే స్పందించే గుణం వీటికి మాత్ర‌...

ఆల‌యాలు క్లోజ్..ద‌ర్శ‌నాలు బంద్

చిత్రం
క‌రోనా ఎఫెక్ట్ దెబ్బ‌కు అన్ని రంగాలు విల‌విల‌లాడుతుండ‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్ర‌ధాన ఆల‌యాల‌న్నీ మూసి వేశారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు టీటీడీ ఈఓ సింఘాల్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్, టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డిల‌తో చ‌ర్చించిన మీదట ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. వేలాది మంది ఇప్ప‌టికే వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్నారు. వీరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీటీడీ. క‌రోనా వ్యాధి ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతుండ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే విద్యా సంస్థ‌ల‌ను మూసి వుంచారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, క‌నీసం 15 రోజుల పాటు ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించారు. దీంతో ప్ర‌ధాన ఆల‌యాలు వేములాడ రాజ‌న్న‌, యాదాద్రి శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి, భ‌ద్రాద్రి రామాల‌యం, బాస‌ర‌, ఆలంపూర్, బీచుప‌ల్లి, శ్రీ‌శైలం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, కాణిపాకం, శ్రీ‌శైలం, మ‌హానంది, మంత్రాల‌యంతో పాటు శ్రీ‌కా...

క‌రోనాపై ఫ్యాన్స్ ఫైర్

చిత్రం
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాల‌తో పాటు క్రీడారంగం కూడా కుదుపున‌కు లోనైంది. ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఈ వైర‌స్ దెబ్బ‌కు క్రికెట్, బ్యాడ్మింట‌న్, టెన్నిస్, వాలీబాల్, చెస్, ఫుట్ బాల్, బేస్ బాల్, హాకీ, త‌దిత‌ర అన్ని ఆట‌లు అర్ధాంత‌రంగా ర‌ద్ద‌య్యాయి. ప్ర‌స్తుతం జ‌పాన్‌లో జ‌రుగుతున్న ఒలంపిక్ గేమ్స్ కూడా జ‌రుగుతాయో లేదోన‌న్న మీమాంస నెల‌కొంది. మ‌రో వైపు ఇండియాకు ఐకాన్‌గా ఉన్న క్రికెట్ కు సంబంధించి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అసాధ‌ర‌ణ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ పోటీలు జ‌ర‌గాల్సి ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తాము కూడా తాత్కాలికంగా అన్ని మ్యాచ్‌ల‌ను, టోర్న‌మెంట్ ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బిసిసిఐ చీఫ్ సౌర‌బ్ గంగూలీ వెల్ల‌డించారు. దీంతో కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్ల‌నుంది. అంతే కాకుండా స్పాన్స‌ర్స్ చేస్తున్న కంపెనీలు సైతం భారీగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ర‌ద్దు చేయ‌డం కాకుండా వాయిదా మాత్రం వేయాలని కోరుతున్నాయి. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బీసీసీఐ అత్య‌వ‌స‌ర స‌మావేశ...

మంజ్రేక‌ర్‌కు పండిట్ బాస‌ట

చిత్రం
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు  కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్‌ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌ ఎవర్నీ కావాలని గాయ పరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్‌ చిన‍్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేక పోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్‌ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్‌ పండిట్‌ కోరాడు. నాకు మంజ్రేకర్‌ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను ...

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఛాన్స్

చిత్రం
క‌రోనా పుణ్య‌మా అంటూ ఆయా కంపెనీల్లో ప‌నిచేస్తున్న వారికి ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప‌ని చేసుకునే స‌దుపాయం క‌లుగుతోంది. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అన్ని దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో తాము ప్ర‌యాణం చేస్తూ ఆఫీసుల‌కు రాలేమంటూ ఉద్యోగులు తెగేసి చెప్ప‌డంతో కంపెనీలు కాళ్ల బేరానికి వ‌చ్చాయి. దీంతో ఆఫీసుల‌కు మాత్రం రాక‌పోయినా ప‌ర్వాలేదు కానీ టైం త‌ప్ప‌కుండా నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను తాము స‌మ‌కూరుస్తామంటూ కంపెనీల య‌జ‌మానులు స్ప‌ష్టం చేశారు. దీంతో సందిట్లో స‌డేమియా అన్న చందంగా ఫుల్ జోష్ మీదున్నారు. ఎక్కువ‌గా అమెరికా, ఫ్రాన్స్, సింగ‌పూర్, లండ‌న్ , త‌దిత‌ర దేశాల్లో ఎక్కువ‌గా ఉంటున్న అన్ని రంగాల కంపెనీల‌న్నీ వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. దీనిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఉద్యోగులు సైతం వ‌ర్క్‌లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. తాజాగా ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఫేస్ బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే క‌రోనా ప్ర‌భావం ఉన్నందున ఉద్యోగుల‌కు అద‌న‌పు బోన‌స్ ప్ర‌...