పోస్ట్‌లు

సామాన్యుడిదే విజ‌యం..కేజ్రీదే రాజ్యం

చిత్రం
స‌మాచార హ‌క్కు చ‌ట్టం భార‌త రాజ్యాంగం పౌరుల‌కు క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు. దేశ వ్యాప్తంగా త‌మకంటూ ఎదురే లేకుండా చేసుకుంటూ వ‌స్తున్న మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి దిమ్మ తిరిగేలా చేసిన చ‌రిత్ర ఆమ్ ఆద్మి పార్టీకే ద‌క్కింది. ఎలాంటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌కుండా కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పిస్తూ వ‌చ్చిన ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీకి చెందిన మంత్రులు, ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాతో పాటు ప‌లువురు సీనియ‌ర్ దిగ్గ‌జాలు సైతం ఢిల్లీలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప్ర‌చారం చేప‌ట్టారు. అయినా వీరి పాచిక‌లు పార‌లేదు. వ్యూహాలు ఫ‌లించ‌లేదు. ఢిల్లీ ఓట‌ర్లు మాత్రం మాయ మాట‌లు, హామీలను న‌మ్మ‌లేదు. బీజేపీ మాత్రం ఎలాగైనా స‌రే ఈసారి కేజ్రీవాల్ ను గ‌ద్దె దించాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు సై...

పూజాకు బిగ్ ఛాన్స్

చిత్రం
టాలీవుడ్‌లో ఉన్న‌ట్టుండి టాప్ పొజిష‌న్‌లోకి దూసుకు వ‌చ్చిన న‌టి పూజా హెగ్డేకు అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల‌ను అందుకున్నాయి. తెలుగు సినిమా రంగంలో పేరున్న న‌టులు మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ , త‌దిత‌రుల‌తో ఆమె న‌టించారు. అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు ఊహించ‌ని రీతిలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాప్ ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో ఆమెకు మ‌రింత డిమాండ్ పెరిగింది. భారీ ఎత్తున అవ‌కాశాలు వ‌చ్చినా ఆమె చాలా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు. మ‌రో వైపు అద్భుతంగా తెలుగులో పాట‌లు కూడా పాడ‌టం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంచి జోరు మీదుకున్న పూజా హెగ్డే కు బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మ‌డు. మ‌రో వైపు ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో  ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్‌ హీరోలందరితో నటిస్తూ మోస్ట్‌ బిజ...

ఆప్‌కే ప‌ట్టం.. సామాన్యుడిదే రాజ్యం

చిత్రం
న‌రేంద్ర మోదీ మంత్రం ఫ‌లించ‌లేదు. ట్ర‌బుల్ షూట‌ర్ పాచిక‌లు పార‌లేదు. కేవ‌లం అభివృద్ధి మంత్రం మాత్ర‌మే జ‌పించిన ఒకే ఒక్క‌డు ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మ‌రోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోనున్నారు. ముచ్చ‌ట‌గా ఇది మూడోసారి. అనుకోని రీతిలో రాజ‌కీయాల్లోకి ఎంట‌రైన ఈ పరిపాల‌కుడు మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇది నిజంగా విస్మ‌రించ‌లేని చరిత్ర అనే చెప్పుకోవాలి. కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఎలాగైనా స‌రే ఆప్ ను తుడిచి పెట్టాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసింది. అయినా ఆప్ దెబ్బ‌కు బీజేపీ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఇక ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్‌ విక్టరీ సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి బంపర్‌ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్‌ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరను...

వారేవా..తలైవా

చిత్రం
తమిళుల ఆరాధ్య దైవంగా భావించే అరుదైన నటుడు రజనీకాంత్ నటించిన దర్బార్ ఊహించని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. పాన్ ఇండియన్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఏకంగా ఈ సినిమా అంచనాలకు మించి 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగులో దర్బార్, అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరూ, ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదలయ్యాయి. ఇవ్వన్నీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా రజనీకాంత్‌ దర్బార్‌ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్‌ కలెక్షన్ల సునామీతో మరో రికార్డు సొంతం చేసుకుంది. విడుదలైన పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దర్బార్‌ అతధిక వసూళ్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్‌ విశ్లేషకుడు త్రినాథ్‌ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టిన రజనీకాంత్‌ ఐదో సినిమా ‘దర్బార్‌’ కావడం విశేషం. గతంలో తలైవా నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధిక భాగం తమిళనాడు నుంచి సుమారు 80 కోట్లు వచ్చాయి....

లెండింగ్ సెక్టార్ లోకి రియల్ మి

చిత్రం
చైనా మొబైల్‌ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్‌  మేకర్‌ ఒప్పో రంగం సిద్ధం చేసింది.  భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పు లిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్‌‌‌‌’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్‌ చేసింది. రియల్‌ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేత్‌ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని  క్రమంగా ఇతర పట్టణాలకు విస‍్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్‌ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించి...

ధోనీకి రిటైర్మెంట్ లేదు

చిత్రం
దేశం గర్వించే అద్భుతమైన ఆటగాళ్లలో ఝార్ఖండ్ కు చెందిన మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఇప్పటికే ఎన్నో అపురూపమైన విజయాలను భరత్ కు అందించిన ఈ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండగా ఇటీవల ధోనీ ఇక తాను ఆడే క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కోట్లాది క్రికెట్ అభిమానులు బిసిసిఐ మీద నిప్పులు కురిపిస్తున్నారు. చాలా కాలంగా భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పైనే. మళ్లీ భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడతాడా..లేదా అనే విషయంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటే ఇటీవల ధోనిని ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాను తొలగించారు.  2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ధోని పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేక పోవడం విస్మయానికి గురి చేసింది. ధోని శకం ముగిసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ధోనికి సమాచారం ఇచ్చిన తర్వాత అతన్ని తొలగించినట్లు బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకర...

పింక్ స్లీప్పులు రెడీ

చిత్రం
నిన్నటి దాకా బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా కంపెనీలు, స్టార్ట్ అప్ లు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు నష్టాలను అదుపులో ఉంచుకునేందుకు గాను ఇప్పటి నుంచే కాస్ట్ కట్టింగ్ అమలు చేస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున ఉద్యోగాలకు కొత్త పెడుతున్నాయి. ఇంకో వైపు ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చేసిన పలు స్టార్టప్‌ కంపెనీలు మూత పడుతుండగా, మరో వైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి. వాటిల్లో శ్యామ్‌సంగ్‌ ఇండియా లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీల నుంచి పేటీఎం లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ఉన్నాయి. రిటేల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియా గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌కు చెందిన వారున్నారు. శ్యామ్‌సంగ్‌ ఇండియా 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమా...