పిచ్చెక్కిస్తున్న పోస్టర్..రచ్చ చేస్తున్న రష్మిక

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ కు కొదువ లేదు. ఎందరో ప్రతిభావంతులు కలిగిన టెక్నీషియన్స్ తామేమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటీవల యంగ్ టాలెంట్ దుమ్ము రేపుతోంది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, పరుశురాం, తదితరులు రాణిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారు ఇటీవల రచ్చ రచ్చ చేస్తూ యూట్యూబ్ ను, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. నటుల్లో కమెడియన్స్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళుతున్నారు. వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. తాజాగా హీరో నితిన్ రెడ్డి మరోసారి తన అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెర కెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘భీష్మ’కు సంబంధించిన పోస్టర్లను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్లను తీవ్రంగా ఆకట్టు కుంటున్నాయి. హీరోయిన్‌ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చె క్కించడం ఖాయమని కామెంట్‌ చేస్తున్నారు. అ..ఆ సినిమా తర్వాత భీష్మతో నితిన్‌ సూపర్‌ హిట్‌ అందు కోవడం ఖాయమని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇందులో గీత గోవిందం నటి రష్మిక మందాన కథా నాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘అఆ’ తర్వాత హీరో నితిన్‌కు సరైన విజయాలు లేవు. లై, ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్‌ తీసిన సినిమాలు   హిట్‌ సాధించలేక పోయాయి. కాస్త విరామం తర్వాత నితిన్‌ వరుసగా సినిమాలతో దూకుడు పెంచాడు. మొత్తం మీద నితిన్ ఫ్యాన్స్ భీశం పోస్టర్ తో పండుగ చేసుకుంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!