లిక్కర్ షాపులొద్దు..లైబ్రరీలు ముద్దు


తెలంగాణ ప్రభుత్వం మద్యం జపం చేస్తుంటే, అదే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.  దీనిని ప్రవీణ్ కుమార్ పట్టించు కోలేదు. యధావిధిగా గురుకులాలు ఓపెన్ చేశారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఐపీఎస్ అధికారికి మరో పేరు కూడా ఉంది. అదేమిటంటే మోనార్క్ అని. ఒకరు చెబితే వినిపించుకోదు అని. తనకు తోచిందే చేస్తాడనే ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉండగా ఆయన వచ్చాక గురుకులాలు బాగు పడ్డాయని, పిల్లలకు మంచి భోజనం, వసతి సౌకర్యాలు, చదువు అందుతోందని, మెరుగైన ఫలితాలు వస్తున్నాయంటూ మరి కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా స్వేరోస్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే ఎక్కువగా చెప్పే ప్రవీణ్ కుమార్ ఏది మాట్లాడినా ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా సంచలన కామెంట్స్ చేశారు ప్రవీణ్ కుమార్. ఒక్క మద్యం పాలసీ ద్వారానే కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి ప్రభుత్వానికి.

గ్రామాల్లో లిక్క ర్‌ కాదు కావాల్సింది చదువు కునేందుకు గ్రంధాలయం ఉండాలని అన్నారు. ఆకలేస్తే అక్షరాలు తినాలని విద్యార్థులకు చెప్పారు. కన్నాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కష్టపడి మార్కులు పొందిన మీరు, మరింత కష్టపడితే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎందుకు కాలేరని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పేద విద్యార్థులు శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. 

కామెంట్‌లు