పోస్ట్‌లు

ఆరోగ్యానికి బలం..తల్లి పాలు శ్రేయస్కరం

చిత్రం
  ఎల్లలంటూ ఎరుగరు. వాన కురిసినా..ఆకాశంలో నక్షత్రాలు మెరిసినా ..అవి తమ కోసమే అని ఆనందపడుతూ ..ఎలాంటి మాయా మర్మం ఎరుగని పిల్లలంటే ఎంతో ఇష్టపడతాం. ప్రేమిస్తాం. గుండెల్లో హత్తుకుంటాం. మానవ జీవితంలో అరుదైన సన్నివేశం బాల్యం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు సంతోషం వెళ్లి విరుస్తుంది. పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కావాల్సింది తల్లి ప్రేమ ఒక్కటే కాదు..అంతకంటే పిల్లలకు పాలు ఇవ్వడం. గతంలో కొన్నేళ్ల పాటు పాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. ఇప్పుడది మారి పోయింది. తమ అందం ఎక్కడ చెడి పోతుందోనన్న ఆందోళనకు లోనవుతున్న తల్లులు పిల్లలను పట్టించు కోవడం లేదని , వైద్యులతో పాటు యుఎన్ఓ ఆవేదన వ్యక్తం చేసింది. పాలివ్వడం అనేది నేరం కాదని, అది బిడ్డకు తల్లికి మధ్య బంధం బాల పడేందుకు దోహదం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం బిడ్డ పుట్టాక ఆరు నెలలపాటు ఇస్తే బావుంటుందని పేర్కొంటున్నారు. ప్రపంచమంతటా తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి రోగాలు రావని, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని ప్రచారం చేయాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది సంస్థ. తల్లి పాలు ఇవ్వని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుత...

గుండె నుంచి గుండెల్లోకి..క్యూబా మోహన రాగం..!

చిత్రం
  ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని, పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా పక్కలో బల్లెం లా తయారైన క్యూబా పేరు తలుచుకున్నప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు రోమాలు పైకి లేస్తాయి. శరీరంలో ఏదో విద్వత్తు ప్రవహిస్తుంది. క్యూబా ..కాస్ట్రో ..చేగువేరా ..గుండెల్లో కదలాడుతూనే వుంటారు. ఎందుకంటే చూస్తే చిన్న దేశం. కానీ యుఎస్ కు ముచ్చెమటలు పట్టించిండ్రు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అమెరికా ఇప్పటికీ కాస్ట్రో పేరు తలుచుకుని భయ పడుతోంది. అంతేనా ప్రభావితం చేస్తూ నియతం వెంటాడుతున్న ఒకే ఒక్కడు చేగువేరా. ఉద్విగ్న మైన చరిత్రకు, పోరాటాలకు ఊపిరి పోసిన చరిత్ర క్యూబాది. అందుకే ఆ దేశమన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి. ఈ లోకంలో ఎందరో హీరోలయ్యారు. ఇంకొందరు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసారు. జనం గుండెల్లో రాజులయ్యారు. మహారాజులై కీర్తింప బడుతున్నారు. ఏళ్ళు గడిచినా , కాలం వెళ్లి పోతున్నా, సాంకేతికత కొత్త పుంతలు తొక్కినా , పోగేసుకున్న చరిత్ర అలాగే ఉన్నది. పాడు కోవడానికో లేదా గుర్తు తెచ్చు కోవడానికో కాదు..కోట్లాది ప్రజల ఆర్త నాదం. క్యూబా గురించి ..కన్నడ నాట గొప్ప రచయితగా పేరొంద...

ఈ భూమి పుత్రుడు..చెరువుల పాలిట దేవుడు..!

చిత్రం
  ప్రపంచానికి ఆధారం ఈ భూమి. ఇది లేకపోతే మానవ జాతి మనుగడ మరింత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే సకల మానవాళి ఇబ్బందులకు లోనవుతోంది. గాలి, నీరు , నేల అంతా కలుషితమవుతోంది. ఇండియాలో వ్యర్థాల దెబ్బకు కోట్లాది మంది చెప్పుకోలేని రోగాలకు లోనవుతున్నారు. భూమికి జీవనాధారమైన నీళ్లను ఒడిసి పట్టుకుని , పది కాలాల పాటు నిల్వ ఉంచుకునే వెసులుబాటు చెరువులు , సరస్సుల ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం భారతీయులకు మాత్రమే చెల్లింది. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఈ తరహా చెరువులు, నీటి కుంటలు అగుపిస్తాయి. దీనినే నమ్ముకున్న రైతులు, ప్రజలకు తాగు, సాగు నీరు దొరుకుతోంది. వందేళ్లైనా ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి చెరువులు, నీటి కుంటలు, పిల్ల కాలువలు. రాను రాను సాంకేతికంగా పెను మార్పులు చోటు చేసుకోవడంతో చెరువుల, సరస్సుల  ఆధునికీకరణ జరుగుతోంది. అయినా పాలకుల అలసత్వం వల్ల, చాలా చెరువులు ఆక్రమణకు గురి కాగా , మరికొన్ని చిరునామా లేకుండా పోయాయి. వాటి స్థానంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. భూఆక్రమణ దారులకు అడ్డు లేకుండా పోయింది. ఇదే తరహా దేశమంతటా విస్తరించింది. రాబోయే తరాలకు నీరు దొరకని పరిస్థితి దాపురించింద...

అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!

చిత్రం
  ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు. వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనికి ఆయా రాష...

సింధు సరే…వీళ్లకేం తక్కువ ..?

చిత్రం
  ఈ దేశాన్ని కాషాయ మయం చేయాలని అనుకుంటున్న మోడీ, అమిత్  షా , ఆర్. ఎస్ . ఎస్.  పరివారం సక్సెస్ అయినప్పటికీ, ఇంకా కార్పొరేట్ , బిజినెస్ టైకూన్లు , రిలయన్స్ అంబానీ, ఆదానీలదే  హవా నడుస్తోంది. మన్ కీ బాత్ , స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తున్నంతగా దేశం ఎదగడం లేదు. వీరి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. ఏకంగా వ్యాపారం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్లాది  రూపాయలు  కొల్లగొడుతూ ఆస్తులు సంపాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బడా బాబులకు వంత పాడుతోంది. ఈ బిలియనీర్లు ఇప్పుడు ఆటగాళ్లను స్పాన్సర్ చేస్తున్నారు. వీరిని బ్రాండ్ అంబాసిడర్లు గా వాడుకుంటున్నారు. ఇండియాలో మహిళల విభాగంలో పీవీ సింధు ఏడాదికి 20 కోట్లకు పైగానే సంపాదిస్తోందని అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఒకే ఒక్క ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ అయిదు బంగారు పతకాలు సాధించి పెట్టి , దేశాన్ని , జాతిని  తలెత్తుకునేలా చేసిన చిరుత పులి హిమ దాస్,  బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన మేరీ కోమ్ , ఒకే కాలుతో ప్రతిభ చూపిన జోషి ...

లోకపు వాకిట నెత్తుటి సంతకం ..పాట..!

చిత్రం
  మనసు మూగదై పోయినప్పుడు దానికి స్వాంతన చేకూర్చే సాధనాల్లో టానిక్ లాగా పని చేసేది, తక్షణమే రిలీఫ్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే పాట. ఈ లోకంలో  సకల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఎప్పుడో ఒకప్పుడు పాడడం రాక పోయినా కనీసం కూని రాగమైనా తీసి ఉంటారు. అడవుల్లో , పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, జంతువులు కూడా ఆనందానికి లోనైనప్పుడు ఆడుతాయి..ఒక్కోసారి అరుస్తాయి కూడా. భూమి పొరల్లో ఇంకి పోయిన ప్రతిది కూడా ఈ ప్రపంచానికి పనికి వస్తుంది. ఒక్క మానవ దేహం తప్ప. అందుకే ఏనాడో సామాజిక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం చెప్పారు. చిల్లర రాళ్లకు మొక్కడం కంటే చిత్తం మీద మనసు పెట్టు అని బతుకు మర్మం..తత్వాన్ని అర్థమయ్యేలా..జనం భాషలో చెప్పారు. తోలు బొమ్మలాటలైనా , చివరకు నాటకమైనా ..ఏదైనా పాట పరిధిలోకి రావాల్సిందే. తాజాగా బెంగాల్ కు చెందిన యాచకురాలు పాడిన పాట వైరల్ అయ్యింది. ఆమెను తక్కువ చేయడం లేదు..కానీ ప్రపంచానికే పోరాటాలతో కొత్త పాఠాలు నేర్పిన తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా గాయకులు , పాటగాళ్లు వందల కొద్దీ కనిపిస్తారు. వారు నిజమైన మట్టి బిడ్డలు. వాళ్ళ గొంతుల్లో మాధుర్యం ఉండక పోవొచ్చు. కానీ గుండెల్లో గూడు కట...

ఇక చాలదా నీ జీవితానికి..!

చిత్రం
  మనకో వేదిక కావాలి ఆలోచనలు కట్టిపెట్టి అనుకున్న ప్రచారం కావాలంటే మనకో గ్రూప్ ఉండాలి అందుకు సరిపడినంత లౌక్యం కావాలి  అప్పుడేగా కర్చు లేకుండా అభిమానులు దొరికేది అబ్బో యెంత ఫాలోయింగో అనుకుంటూ మనం ఆక్షర్యానికి గురవుతాం..అంతలోనే మనకెందుకు అనుకుంటూ సాగిపోతాం ..! ఎవరి దారులు వాళ్ళవి ఎవరి లోకంలో వాళ్ళు లోపట ఒకటి ..బయట మరొకటి మెత్తగా పలకరించే ప్లాస్టిక్ నవ్వులు అప్పుడప్పుడు కాసింత సేద దీర్చే మనుషులు మరి మనను గుర్తించాలంటే వాళ్ళను మెస్మరైస్ చేయాలంటే మనకూ ఓ సమూహం కావాలి అది మనతో పాటే సాగేలా మన కనుసన్నలలో ఉండేలా చూసుకోవాలి …అప్పుడేగా లైక్ లు ..అబ్బో అంటూ కామెంట్లు ఇంకాస్తా ముందుకు వెళితే అహో అంటూ కితాబులు ..! నువ్వు కవి కాదల్చుకున్నవా తక్కువ కాలంలో గొప్పనైన వ్యక్తిగా అంతర్జాలంలో నీ పేరు మారు మోగాలా అయితే నీకు ఎలాంటి ప్రశ్నలు అక్కర్లేదు నీ గురించి పతాక స్తాయిలో గొప్పగా అభివ్యక్తీకరిస్తే చాలు కాస్తంత లౌక్యం ఉంటె సరి ఇంకెందుకు ఆలశ్యం రండి ..పైసా ఖర్చు లేకుండా మహా కవి కాదల్చుకున్నవా ..! అయితే వెంటనే ఓ వేదిక చూసుకో నీకంటూ ఓ గ్రూప్ వెంటేసుకో నిన్ను ప్రశించే వాళ్ళు లేకుండా చూసుకో ఇక..నీవొక బ్రా...